సింగరేణి ఉద్యోగులకు హ్యాండ్స్‌ ఆన్‌ సీపీఆర్‌ శిక్షణ

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి GDK-1, 3 బొగ్గు గనుల ఆవరణలో ఆదివారం, సోమవారం హాండ్స్ ఆన్ సీపీఆర్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అత్యవసర సమయాల్లో గుండె ఆగిపోయిన వారికి వెంటనే సీపీఆర్ అందించడం, ప్రాణాలను కాపాడేందుకు ప్రాథమిక పద్ధతులపై ఉద్యోగులకు అధికారులు ప్రాక్టికల్ గా శిక్షణ ఇచ్చారు. సేఫ్టీ ఆఫీసర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి సీపీఆర్ లో శిక్షణ పొందడం అవసరమని, 60 రోజుల పాటు అన్ని విభాగాలలో ఈ శిక్షణ కొనసాగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕