భక్తిశ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనం

పెద్దపల్లి జిల్లాలో నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించి, తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడిని ఘనంగా నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తి పాటలు, జై గణేశా నినాదాలతో ఊరేగింపుగా వెళ్లి వినాయకుడిని నిమజ్జనం చేశారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.

సంబంధిత పోస్ట్

✕
✕