విద్యుత్ కార్మికుల నిరవధిక సమ్మె

తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయం వద్ద బుధవారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్, ఆన్ మ్యాన్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరిగింది. ఆర్టిజన్ కార్మికులకు స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేసి ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఆన్ మ్యాన్ కార్మికులను ఆర్టిజన్స్ గా గుర్తించి సంస్థలో విలీనం చేసుకోవాలని, మీటర్ రీడర్స్, పీస్ రేటు కార్మికులకు జీఓ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్