నూతన మినీ ట్రాన్స్‌ఫార్మర్ల ప్రారంభం

రామగిరి మండలంలోని పన్నూర్ పంచాయతీ పరిధిలో వకీల్‌పల్లె ఫ్లాట్స్‌లో రెండు నూతన 25 కేవి మినీ ట్రాన్స్‌ఫార్మర్‌లను మంగళవారం ఏర్పాటు చేశారు. ఫ్లాట్స్‌లో పెరుగుతున్న విద్యుత్ లోడ్ కారణంగా తలెత్తుతున్న తక్కువ వోల్టేజ్, తరచూ పవర్ కట్స్ సమస్యలను ప్రజలు పన్నూర్ గ్రామ సర్పంచ్ గ్రామ చిందం మహేశ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ విద్యుత్ శాఖ ఏడీఈ వెంకట్ నారాయణ, ఏఈ మహేందర్ రెడ్డితో చర్చించి, మంగళవారం నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్