సన్న బియ్యం పంపిణీని పరిశీలించిన ఎంపీ

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ విధానాన్ని పరిశీలించారు. రేషన్ దుకాణంలో నిల్వలు, పంపిణీ తీరు, బియ్యం నాణ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. రాబోయే మూడు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయా అని డీలర్‌ను అడిగి తెలుసుకున్నారు. పంపిణీ అవుతున్న బియ్యం పరిమాణం, నాణ్యతపై స్పష్టత తీసుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రజలతోనూ ఎంపీ మాట్లాడారు.

సంబంధిత పోస్ట్