గోదావరిఖనిలో జాతీయ జెండా ఆవిష్కరణ

గోదావరిఖనిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ రాజేందర్ జాతీయ జెండాను ఎగురవేశారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణకు స్వాతంత్ర్య దినంగా భావించవచ్చని, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఈ రోజును అధికారికంగా జరుపుకుంటున్నామని ఆయన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్