ఎన్టిపిసి రామగుండం ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్ వద్ద రాజీవ్ రహదారిపై ఉన్న బస్సు షెల్టర్లు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. క్రాస్ రోడ్ లోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న హెచ్ కె ఆర్ బస్సు షెల్టర్ ను రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించారు. మరో బస్సు షెల్టర్ లోని బెంచులు కూడా విరిగిపోయి ఉన్నాయి. గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికుల సౌకర్యం కోసం బస్సులను సర్వీస్ రోడ్డు వైపు మళ్లించినా, షెల్టర్ల అసౌకర్యం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కొత్త బెంచీలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.