రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం గోదావరిఖని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తుండగా విధుల్లో భాగంగా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు కెమెరాతో ఫోటోలు తీస్తుండగా నడుచుకుంటూ వెళ్తున్న పవర్ హౌస్ కాలనీకి చెందిన అనుమాల మనోజ్ కుమార్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తూ ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టాడు. వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆదేశానుసారం ఎస్ఐ భూమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.