పెద్దపల్లి జిల్లా రామగుండం నగరంలో వీధి కుక్కల దాడులు కొనసాగుతున్నాయి. బుధవారం గోదావరిఖని లక్ష్మీనగర్లోని బోళ్ల బజార్లో 8 ఏళ్ల బాలికపై కుక్కలు దాడి చేసి కరిచాయి. కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని 51వ డివిజన్ కార్పొరేటర్ ఆకారపు రేఖా - మహేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ కార్పొరేటర్ కుమారుడిపై కూడా కుక్కలు దాడి చేసినా చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. వీధి కుక్కల బెడద నుంచి ప్రజలకు రక్షణ కల్పించాలని అధికారులను డిమాండ్ చేశారు.