సింగరేణి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పన లో భాగంగా సిరిసిల్లలో ఇచ్చే శిక్షణకు సోమవారం పలువురు యువత తరలి వెళ్లారు. శిక్షణకు ప్రత్యేక బస్సులు బయలుదేరగా ఆర్ జి -1 జిఎం లలిత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రెండు నెలల ఉచిత శిక్షణకు 30 మంది ఎంపికయ్యా అని జీఎం తెలిపారు. పురుషులు ఎలక్ట్రిషన్ హౌస్ వైరింగ్ లో మహిళలు హోమ్ హెల్త్ ఎయిడ్ లో శిక్షణ తీసుకోనున్నట్టు చెప్పారు.