వర్షాకాలంలో ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ అరుణశ్రీ పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన సమన్యయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇంటింటికి జ్వరం సర్వే నిర్వహించి పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించాలన్నారు. వాటిని వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. తద్వారా వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.