రైతులకు ఎరువు కొరత లేకుండా చూస్తామని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆర్ ఎఫ్ సి ఎల్ ను ఎంపీ సందర్శించి జియం తో సమావేశం అయ్యారు. యూరియా ఉత్పత్తి స్థాయి, సామర్థ్యం లింకేజ్ డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాలపై సమీక్షించారు. కార్మికులకు మద్దతుగా వారి సమస్యలు, వేతనాలు ఉద్యోగ భద్రతపై చర్చించారు. అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.