పెద్దపల్లి జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా, శుక్రవారం వివిధ పాఠశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీవో రంగారావు మాట్లాడుతూ, విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. సీటు బెల్టు ప్రాముఖ్యతను వివరిస్తూ, దానిని ధరించిన వారిని అభినందించారు. పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయంలోనూ అవగాహన కార్యక్రమాలు జరిగాయి.