కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామంలో సమ్మక్క-సారాలమ్మ జాతర జరిగే ప్రదేశాల్లో సర్పంచ్ పోశాల శైలజ-సదానందం గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ పనులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వేముల ప్రవీణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జాతర సందర్భంగా గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు ఈ చర్యలు చేపట్టారు.