సింగరేణి హైస్కూల్ విద్యార్థులు ఎస్ఎస్సీలో సత్తా చాటారు

పెద్దపల్లి జిల్లాలోని సింగరేణి కాలరీస్ హైస్కూల్ (ఎయిడెడ్) విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షల్లో 97.87% ఉత్తీర్ణత సాధించి అద్భుత ప్రతిభ కనబరిచారు. పాఠశాల టాపర్లుగా ఆర్ల వైశాలిక (545 మార్కులు), గుంటుక సిరివల్లి (538 మార్కులు), పుట్ట శివచరణ్ (527 మార్కులు) నిలిచారు. ఈ సందర్భంగా ఆర్జీ-1 జీఎం డి. లలిత్ కుమార్ విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించి, వారి కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎం.రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్