బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సందర్శించి, భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు.