లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న సమ్మె చేయనున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు తెలిపారు. గురువారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి బస్టాండ్ వద్ద సమ్మె జయప్రదం కోసం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి, కార్మికులను బానిసలుగా మార్చే ప్రమాదకరమైన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.