లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 12న చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని సీఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పిలుపునిచ్చారు. సుల్తానాబాద్‌లో సీఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 100 ఏళ్లలో కార్మిక వర్గం సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చేలా నాలుగు లేబర్ కోడ్స్ తెచ్చారని విమర్శించారు. ఈ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.