రిలీజ్‌కు ముందే వన్‌ మిలియన్‌ క్లబ్‌లోకి 'పెద్ది'

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్‌ 4న విడుదల కానుంది. ఓవర్సీస్‌లో జూన్‌ 3న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ బుకింగ్స్‌లో రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటికే వన్‌ మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ను నార్త్‌ అమెరికాలో సాధించింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' తర్వాత చరణ్‌కు ప్రీమియర్స్‌లో ఇది వన్‌ మిలియన్‌ మార్క్‌ సినిమాగా నిలిచింది. దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ, రామ్‌చరణ్‌ పాత్రలో ఒదిగిపోయి, కుస్తీ సన్నివేశాల్లో గాయాలపాలైనా లెక్కచేయకుండా నటించారని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్