మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వి కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న 'పెద్ది' చిత్రం ఫైనల్ ఎడిట్ లాక్ అయింది. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. మే 16న ట్రైలర్ విడుదల చేయాలని, జూన్ 2న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్రబృందం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.