మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం కర్ణాటకలో భారీ వసూళ్లతో కొత్త రికార్డు సృష్టించింది. ప్రీమియర్ షోల ద్వారానే రూ.3.02 కోట్లు వసూలు చేసి, 'పుష్ప 2', 'ఓజీ' చిత్రాల రికార్డులను అధిగమించింది. దీనికి ప్రధాన కారణంగా కర్ణాటకలో రామ్ చరణ్‌కు ఉన్న అభిమాన వర్గం, అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రభావం కూడా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.