రామ్ చరణ్ 'పెద్ది' ఓటీటీ విడుదల ఆలస్యం!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కైవసం చేసుకుంది. ఈ మూవీ మొదట జూలై 2న ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విడుదల రెండు వారాలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. జూలై 16 నుండి ఈ మూవీని అందుబాటులోకి తీసుకురావాలని సదరు సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్