హైదరాబాద్‌లో రైతులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్‌ను 'పశుపతి'గా అభివర్ణించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటాడని, కేసీఆర్‌ను పశుపతి అంటే, రేవంత్ రెడ్డి బూతుపతివా అని ప్రశ్నించారు. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయాన్ని, శివుడిని ప్రస్తావిస్తూ.. కేసీఆర్ రైతులను, పాడి పశువులను కాపాడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హరీశ్ రావు హెచ్చరించారు.