కాంగ్రెస్ అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారు: హరీష్‌రావు

TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ MLA హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ఎవడూ నమ్మడని గాంధీల మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. మంగళవారం సిద్దిపేటలో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల వేళ 6 గ్యారంటీల హామీల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి ఇంటింటికీ పంచారని, అధికారంలోకి వచ్చాక ఆ బాండ్ పేపర్లకు దిక్కులేదని విమర్శించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలతో జనం విసిగిపోయారని హరీష్‌రావు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్