గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిలోని టానిన్లు కడుపులో ఆమ్లాన్ని పెంచి గుండెల్లో మంట, కడుపు నొప్పి లాంటి సమస్యలకు దారితీస్తాయి. ఖాళీ కడుపుతో తాగితే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. కాలేయ సమస్యలు, బోలు ఎముకల వ్యాధి ఉన్నవారు, గర్భిణులు, మందులు వేసుకునేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి.