బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమితో పొత్తుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వన్ సైడ్ లవ్ ఎప్పటికీ పనిచేయదని వ్యాఖ్యానించిన ఆయన.. అధికార పార్టీ తమపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని బీహార్ ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. తమను బానిసలుగా ఉంచాలని వారు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు యత్నిస్తున్నట్టు తెలిపారు.