కేరళ రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పాలక్కాడ్‌లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ, కేరళ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. పార్టీ కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్నారని ప్రశంసించారు. ఈ కృషి వల్ల రాష్ట్రంలో రాజకీయ మార్పు స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. భవిష్యత్తులో బీజేపీ కేరళలో మరింత బలపడుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.