వరదల్లో కొట్టుకుపోతుండగా ప్రాణాలకు తెగించి కాపాడారు (VIDEO)

హరిద్వార్‌లోని గంగా నదిలో ప్రమాదవశాత్తు పడిపోయిన వ్యక్తిని NDRF సిబ్బంది ప్రాణాలకు తెగించి రక్షించారు. నీటి ప్రవాహం తీవ్రమై వ్యక్తి కొట్టుకుపోతుండగా, రెస్క్యూ బృందం వెంటనే స్పందించి నీటిలోకి దూకారు. తాడు సహాయంతో అతడిని పట్టుకుని సురక్షితంగా బోటులోకి తీసుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సాహసోపేతంగా ప్రాణాలు కాపాడిన NDRF సిబ్బందిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సంబంధిత పోస్ట్