TG: బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా బీసీ రిజర్వేషన్లు తెచ్చుకుందామని రేవంత్ రెడ్డి శపథం చేశారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీలో కదం తొక్కేందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. 6న జంతర్ మంతర్ లో ధర్నాకు తరలి రావాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల అంశంలో కేంద్రం మోసం చేస్తోందని మండిపడ్డారు. పరిగి నుంచి ప్రారంభమైన జనహిత పాదయాత్రలో మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొని మాట్లాడారు.