దేశంలో గ్యాస్, పెట్రోల్ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఇతర దేశాల నుంచి రావాల్సిన ఇంధనాన్ని వందశాతం తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామని, లాక్‌డౌన్ అనేది ఉత్పన్నమే కాదని, దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. అనేక దేశాలు సుంకాలు పెంచుతుంటే, కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించుకోవాలని సూచించారు. రెండు, మూడు కంపెనీలకు ఇబ్బంది కలిగిందని, అయితే సమస్య పరిష్కారం అయిందని, ఏజెన్సీల దగ్గర ప్రజలు క్యూ కట్టవద్దని కిషన్‌రెడ్డి సూచించారు.