ఈ గుడిలోకి చెప్పులు వేసుకొని వెళతారు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా గుడిలోకి చెప్పులు తీసి వెళ్తాం. కానీ, మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా, మాలాజ్‌పూర్ గ్రామంలోని దేవ్జీ మహారాజ్ ఆలయంలో, అలాగే రత్లామ్ జిల్లాలోని కాళీమాత దేవాలయంలో భక్తులు చెప్పులతోనే ఆలయంలోకి వెళ్లేందుకు అనుమతి ఉంది. దేవ్జీ మహారాజ్ ఆలయంలో జాతర సమయంలో దుష్టశక్తుల నివారణకు, కాళీమాత ఆలయంలో భక్తుల రక్షణకు ఈ ఆచారం పాటిస్తున్నారని స్థానిక విశ్వాసం. పూరీ జగన్నాథ ఆలయంలో మాత్రం వంటశాల, కొన్ని పూజా ప్రాంగణాల్లో పూజారులు చెక్క చెప్పులు ధరిస్తారు. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్