భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ఇన్-స్పేస్ అనుమతిచ్చింది. మన దేశంలో శాటిలైట్ సేవలు అందించేందుకు స్టార్‌లింక్ 2022 నుంచి ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఇన్-స్పేస్ ఐదేళ్ల కాలానికి లైసెన్సు ఇచ్చింది. వన్‌వెబ్, రిలయన్స్ జియో తర్వాత అనుమతులు పొందిన మూడో కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. స్టార్‌లింక్ కిట్ ధర రూ.33,000 వరకు ఉండొచ్చని సమాచారం. నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రూ.3,000-4,200 వరకు ఉండొచ్చు.