కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో, ప్రముఖ నటుడు, టీవీకే చీఫ్ విజయ్ తమిళనాడులోని ఈరోడ్‌లో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు. ఈనెల 18న విజయపురిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 16 ఎకరాల ప్రైవేట్ భూమిలో ఈ ర్యాలీ జరగనుంది. శాంతిభద్రతల దృష్ట్యా 84 షరతులు విధించడంతో పాటు, నిర్వాహకులు రూ.50 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలని, కార్యక్రమం అనంతరం వేదికను శుభ్రం చేసి అప్పగించాలని పోలీసులు ఆదేశించారు.