పాకిస్తాన్‌లోని లాహోర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. లాహోర్‌లోని ఒక వీధిలో పెంపుడు సింహం అకస్మాత్తుగా ఒక మహిళ, పిల్లలపై దాడి చేసింది. వెంటనే అక్కడ ఉన్న ఓ వ్యక్తి బెదిరించడంతో సింహం అక్కడ నుంచి పరారైంది. ఈ ఘటనలో మహిళ, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పాకిస్తాన్ అధికారులు ప్రైవేట్ సింహం యజమానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.