రేపటి నుంచి ఢిల్లీలో వాహనదారులపై కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. జూలై 1 నుంచి 10 ఏళ్లు పూర్తైన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు పెట్రోల్ బంకులలో ఇంధనం అందించరని అధికారులు స్పష్టం చేశారు. ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త రూల్స్‌తో వృద్ధ వాహనాల ఉపయోగం తగ్గి, వాతావరణ నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.