పెట్రోల్, డీజిల్ వాహనాలకు దీర్ఘకాలంలో స్థానం ఉండదని, భవిష్యత్తు స్వచ్ఛమైన ఇంధనాలదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. బవర్ల్ద్ ఇండియా కాంక్లేవ్ 2025లో మాట్లాడుతూ పెరుగుతున్న దిగుమతులు, పర్యావరణ సమస్యలు దీనికి కారణాలని తెలిపారు. బయోఫ్యూయల్స్, సిఎన్‌జి, ఎల్‌ఎన్‌జి, ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.