అంగోలాలో సబ్సిడీలను తొలగించి ఇంధన ధరలను పెంచాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. పెట్రోల్‌పై రూ.9 పెంపు, టాక్సీ ఛార్జీలను 50శాతం వరకు పెంచడంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రజలు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణలో ఇప్పటివరకు 22 మంది మరణించారు. 500 మందికిపైగా గాయపడ్డారు. 1200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.