రష్యాలో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద క్యూలు (వీడియో)

ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ప్రస్తుతం పెట్రోల్ కొరతను ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ దాడుల కారణంగా పలు చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో ఇంధన ఉత్పత్తి, సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరుగుతున్న ఇంధన సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలపై రష్యా దృష్టి సారించినట్లు సమాచారం. ఈ పరిణామం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్