డబ్బు కోసం పెట్రోల్ బంక్ ఉద్యోగిని చంపేశారు (వీడియో)

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో గురువారం దారుణం జరిగింది. మందిర్ హసౌద్ సమీపంలోని జాతీయ రహదారిపై పెట్రోల్ బంక్‌లో దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఇద్దరు పెట్రోల్ బంక్ ఉద్యోగులపై నిందితులు సమీర్ టాండ్, కునాల్ తివారీ కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో సూపర్‌వైజర్‌ ప్రాణాలు కోల్పోయాడు. హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్