ఇకపై మూడు రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్!

ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త. ఇక నుంచి మూడు రోజుల్లోనే పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్ కానున్నాయి. అర్హులైన ఖాతాదారులు కేవైసీ వివరాలు సరిగ్గా ఉండి, అన్ని షరతులు పాటిస్తే కేవలం మూడు రోజుల్లో పీఎఫ్ సొమ్ము ఖాతాలోకి చేరుతుంది. సకాలంలో ప్రాసెసింగ్ జరిగేలా చూసేందుకు 20 రోజుల నిబంధన విధించారు. ఆటో సెటిల్మెంట్ పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచారు. UAN నెంబర్‌తో ఆధార్ లింక్ చేసినవారు, బ్యాంక్ అకౌంట్ వివరాలు అప్డేట్ చేసిన, కేవైసీ పూర్తి చేసినవారికి మరింత వేగంగా క్లెయిమ్స్ అందుతాయి.

సంబంధిత పోస్ట్