ప్రైవేట్ రంగ ఉద్యోగులకు షాక్ తగలనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (PF) డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో జరిగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంలో ఈ నిర్ణయం వెలువడనుంది. వడ్డీ రేటును 8 నుంచి 8.20% మధ్య తగ్గించవచ్చని పలు నివేదికలు వివరిస్తున్నాయి. గత ఆర్థిక ప్రధాన్ మంత్రి వికాసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ఎక్కువ మంది EPFOలో చేరడం, కనీస బఫర్ నిర్వహణ వంటి కారణాలతో వడ్డీ రేట్లు తగ్గవచ్చని అంచనా.