ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకునే అవకాశం మార్చి 2026 లోపు అందుబాటులోకి రానుందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. కారణం చెప్పకుండానే ఉద్యోగులు 75% వరకు పీఎఫ్ తీసుకోవచ్చని, నిబంధనలను సులభతరం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పీఎఫ్ అకౌంట్ కు బ్యాంక్ ఖాతా లింక్ చేసుకుంటే డెబిట్ కార్డుతో ATMతో విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పించబడుతుందని వెల్లడించారు.