ట్రంప్ సుంకాలతో ఫార్మా రంగం కుదేలు.. రూ.74,000 కోట్లకు పైగా నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మా దిగుమతులపై 100 శాతం సుంకాన్ని విధించారు. ఈ సుంకాలు అక్టోబర్ 1 నుండి అమల్లోకి వస్తాయి. దీనితో శుక్రవారం స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే ఫార్మా ఇండెక్స్ 2 శాతం కంటే ఎక్కువ పడిపోయింది. దేశంలోని 119 ఫార్మాస్యూటికల్ కంపెనీలలో 112 షేర్లు క్షీణించాయి. ట్రేడింగ్ సెషన్‌లో ఫార్మా రంగం వాల్యుయేషన్ రూ.74,000 కోట్లకు పైగా నష్టపోయింది. అమెరికాకు భారత్ ఫార్మా ఎగుమతులు గణనీయంగా ఉన్నప్పటికీ, ఈ నిర్ణయం డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా వంటి ప్రధాన కంపెనీలపై ప్రభావం చూపనుంది.

సంబంధిత పోస్ట్