జులానా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ తన అభ్యర్థిగా వినేశ్ ఫోగాట్‌ను ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ వేవ్ ఉందని, మరోవైపు ఫోగాట్ హర్యానా బిడ్డ కావడంతో ఆమెపై సానుభూతి ఉందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కనిపించనప్పటికీ జులనాలో మాత్రం ఫోగాట్ విజయం సాధించారు. ఈ స్థానంలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి యోగేశ్ కుమార్, ఆప్ అభ్యర్థి కవితా రాణి ఆమె చేతిలో పరాజయం పాలయ్యారు.