ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరగడంతో సైబర్ మోసాలు అధికమయ్యాయి. మాల్వేర్ దాడుల ద్వారా ఫోన్లలోని ముఖ్యమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, కేంద్ర ప్రభుత్వం CERT-in ద్వారా ఉచిత బాట్ రిమూవల్ టూల్‌ను అభివృద్ధి చేసింది. ఈ టూల్ ఫోన్‌ను స్కాన్ చేసి, మాల్వేర్‌ను తొలగిస్తుంది. విండోస్ యూజర్లు యాంటీ వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, థర్డ్ పార్టీ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని నిపుణులు సూచించారు.