ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే, తమ యూజర్ల కోసం 'ఫోన్‌పే పీజీ బోల్ట్' అనే కొత్త ఫీచర్‌ను శనివారం ప్రారంభించింది. వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీల కోసం ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ 'డివైస్ టోకెనైజేషన్' టెక్నాలజీపై పనిచేస్తుంది. యూజర్లు తమ కార్డ్ వివరాలను ఫోన్‌పే యాప్‌లో ఒక్కసారి సేవ్ చేస్తే, మళ్లీ మళ్లీ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. తదుపరి లావాదేవీలకు సీవీవీ నంబర్ కూడా అడగదు, దీంతో చెల్లింపులు వేగంగా, సురక్షితంగా పూర్తవుతాయి.