హైదరాబాద్‌లో పికో టెక్నాలజీ కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్ హైటెక్ సిటీలో రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు శుక్రవారం పికో టెక్నాలజీ ఇండియా కార్యాలయాన్ని ప్రారంభించారు. గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏడాదిలో 100 కొత్త జీసీసీలను ఏర్పాటు చేయడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. పికో టెక్నాలజీ రాకతో స్థానిక యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕