సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై న్యాయవాది బాబూరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిగాచి పరిశ్రమలో భద్రతా చర్యలు లేవని పిటిషనర్ బాబురావు పేర్కొన్నారు. పేలుడు ఘటనలో ఇంకా 8 మంది ఆచూకీ లభించలేదని.. ప్రమాదంపై ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక బయటపెట్టాలన్నారు.