ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌కు చెందిన రాజేష్ మిశ్రా అనే వ్యక్తి ఇంట్లో డబ్బులు కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. అయితే రాజేశ్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్స్‌లో అతడి ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కించడానికి దాదాపు 10 మంది పోలీసులు కష్టపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.