పెళ్లైన కొన్ని గంటలకే.. హెలికాప్టర్‌ ప్రమాదంలో వరుడు మృతి

అమెరికాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వివాహమైన కొన్ని గంటలకే భారత సంతతికి చెందిన డేవ్‌ ఫిజీ, జెస్నీల హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. జార్జియాలోని డాసన్ కౌంటీలో జరిగిన వివాహానంతరం, కొత్త జంట హెలికాప్టర్‌లో విహారయాత్రకు వెళ్లగా, డాసన్‌విల్లే సమీపంలో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పెళ్లికొడుకుతో పాటు పైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, పెళ్లికూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. వాతావరణం అనుకూలించకపోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. డేవ్‌ ఫిజి డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్